విదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు చెల్లింపులను - Payments to foreign software companies cannot be considered royalty
close

Updated : 03/03/2021 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు చెల్లింపులను

రాయల్టీగా పరిగణించలేం సుప్రీంకోర్టు

దిల్లీ: కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం నిమిత్తం విదేశీ తయారీదార్లకు భారతీయ నివాసితులు లేదా డిస్ట్రిబ్యూటర్లు చెల్లించే మొత్తాలను ‘రాయల్టీ’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో కాపీరైట్‌ వినియోగానికి చెల్లించే మొత్తాన్ని రాయల్టీగా భావించలేమని, భారత్‌లో పన్ను విధించలేమని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన బెంచ్‌ తీర్పు చెప్పింది. ఆదాయపు పన్ను విభాగం దాఖలు చేసుకున్న అప్పీలును కొట్టివేసిన సుప్రీంకోర్టు, మదింపుదార్ల అప్పీళ్లకు అనుమతి ఇచ్చింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని