చల్లారని చమురు మంట..భోపాల్‌లోనూ సెంచరీ! - Petrol prices hiked
close

Published : 12/05/2021 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చల్లారని చమురు మంట..భోపాల్‌లోనూ సెంచరీ!

దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు వరుసగా మూడోరోజూ కొనసాగింది. డీజిల్‌, పెట్రోల్ ధరను లీటరుకు 25 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.92.05కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.61కి పెరిగింది.

ఇతర నగరాల్లో చూస్తే ముంబయిలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం లీటరు ధర రూ.98.36గా ఉంది. డీజిల్ ధర రూ.89.75కి చేరింది. చెన్నైలో లీటరు ధర రూ.93.84 ఉండగా.. డీజిల్ రూ.87.49కి చేరింది. కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా... రూ.92.16, రూ.85.45గా ఉన్నాయి. మన హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.95.67, లీటర్‌ డీజిల్‌ రూ.89.47కు లభిస్తోంది.

ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. తాజా పెంపుతో భోపాల్‌ కూడా ఈ జాబితాలో చేరింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌కు రూ.100కు పైగా చెల్లించాల్సి వస్తోంది.

అంతర్జాతీయ చమురు ధరలు బుధవారం కూడా పెరిగాయి. అమెరికాలోని చమురు నిల్వలు తగ్గడం, కీలక పైప్‌లైన్‌ వరుసగా ఆరో రోజూ మూసి ఉండడంతో ఒపెక్‌ దేశాల చమురుకు గిరాకీ పెరిగి ధరలు ఎగబాకాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ ధర 15 సెంట్లు పెరిగి 68.70 డాలర్లుగా నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని