close

Published : 18/04/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్‌టీజీఎస్‌ సేవల్లో అంతరాయం!

మధ్యాహ్నం 2గంటల వరకు నిలిచిపోనున్న సేవలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక మొత్తంలో లావాదేవీల కోసం జరిపే ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగనుంది. నెఫ్ట్‌ సేవలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గురువారమే ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతోనే ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

‘‘ఏప్రిల్‌ 17న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఆర్‌టీజీఎస్‌ వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నాం. అందువల్ల ఏప్రిల్‌ 18న మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. అయితే నెఫ్ట్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి’’ అని ట్విటర్‌ వేదికగా ఆర్‌బీఐ గురువారం తెలిపింది.

రూ. 2లక్షలు అంతకంటే పైబడిన సొమ్మును బదిలీ చేయడానికి ఆర్‌టీజీఎస్‌ సేవలను ఉపయోగిస్తుంటాం. అయితే, ఇందులోని ‘డిజాస్టర్‌ రికవరీ టైమ్‌’ను మెరుగుపర్చేందుకు ఆర్‌టీజీఎస్‌ సాంకేతిక వ్యవస్థలో ఆర్‌బీఐ మార్పులు చేపడుతోంది. గతేడాది డిసెంబరు 14 నుంచి ఆర్‌టీజీఎస్‌ సేవలను ఆర్‌బీఐ 24×7 అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని