ఒక్క మిస్డ్‌ కాల్‌తో `ఎస్‌బీఐ` వ్య‌క్తిగ‌త లోన్‌ - SBI-personal-loan-is-just-a-missed-call-or-an-SMS
close

Updated : 17/02/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క మిస్డ్‌ కాల్‌తో `ఎస్‌బీఐ` వ్య‌క్తిగ‌త లోన్‌

ఇపుడు `ఎస్‌బీఐ` ఎక్స్‌ప్రెస్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొంద‌టానికి ఒక `మిస్డ్‌ కాల్` లేదా ఒక `ఎస్ఎంఎస్` స‌రిపోతుంది.

దేశంలోనే అగ్ర‌స్థాయి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త్వ‌రిత ఆమోదంతో రుణం అవ‌స‌ర‌మైన వినియోగ‌దారుల‌కు వ్య‌క్తిగ‌త రుణాన్ని అందిస్తుంది. ఈ రుణం వివాహం, విహార‌యాత్ర‌, ఊహించ‌ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి,  ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన కొనుగోలు అయిన‌, ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు దాని వెబ్‌సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ ఎస్‌బీఐ యొక్క ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్ ద్వారా క‌నీస డాక్యుమెంటేష‌న్‌తో స‌త్వ‌ర రుణ ఆమోదం పొందొచ్చు.

వ్య‌క్తిగ‌త రుణం అవ‌స‌ర‌మైన వారు 7208933145 నెంబ‌ర్‌కు అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంప‌వ‌చ్చు.
లేదా  7208933142 నెంబ‌ర్‌కు మిస్డ్‌ కాల్ ఇవ్వవ‌చ్చు.

ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్ కు సంబంధించి కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు :

 • రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం.
 • త‌క్కువ వ‌డ్డీ రేటు
 • రుణ బ్యాలెన్స్ పైనే వ‌డ్డీ
 • తక్కువ ప్రాసెసింగ్ ఛార్జీలు
 • క‌నిష్ట డాక్యుమెంటేష‌న్‌
 • తెలియ‌ని ఖ‌ర్చులుండ‌వు
 • రెండొవసారి రుణ కేటాయింపు
 • రుణానికి సెక్యూరిటీ గాని హామిగానీ అక్క‌ర్ల‌లేదు.

రుణ అర్హ‌త :

 • ఎస్‌బీఐలో జీతం ఖాతా ఉన్న వ్య‌క్తుల‌యి ఉండాలి. క‌నీసం నెల ఆదాయం రూ. 15,000 ఉండాలి.
 • సెంట్ర‌ల్‌, స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్‌, పాక్షిక ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌యి ఉండాలి.
 • సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్స్ మ‌రియు లాభాల‌ను ఆర్జించే రాష్ట్ర ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉద్యోగుల‌యి ఉండాలి.
 • ప్ర‌ముఖ జాతీయ విద్యాసంస్థ‌ల ఉద్యోగులు.

క‌నీస రుణ మొత్తం రూ. 25,000. గ‌రిష్ట రుణ మొత్తం రూ. 20 ల‌క్ష‌లు.

ఈ ఎస్‌బీఐ రుణంపై వ‌డ్డీ రేటు 9.6%.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని