Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లోనే సూచీలు - Sensex Nifty end higher amid volatility
close

Updated : 05/08/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లోనే సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల వరుస భారీ లాభాల అనంతరం గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులకు లోనైనా.. లాభాల పరంపరను కొనసాగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు డీలా పడినప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ వంటి షేర్లు సూచీలను నడిపించాయి. దీంతో వరుసగా మూడో రోజూ సూచీలు లాభాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.17గా ఉంది.

ఉదయం 54,450 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులు ఎదుర్కొంది. అనంతరం లాభాల్లోకి వెళ్లిన సూచీ చివరికి 123.07 పాయింట్ల లాభంతో 54,492.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35.80 పాయింట్ల లాభంతో 16,294.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని