సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ 14,100+ - Sensex and Nifty end at record highs
close

Published : 04/01/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. నిఫ్టీ 14,100+

ముంబయి: దేశీయ మార్కెట్లు  వరుసగా తొమ్మిదో రోజూ లాభాల్లో ముగిశాయి. కరోనాను అంతమొందించేందుకు ఉద్దేశించిన రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరైన నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడడం కలిసొచ్చింది. దీంతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 48వేల మార్కు దాటగా.. నిఫ్టీ 14,100పైన ముగిసింది.

ఉదయం 48, 123 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యలో కాస్త ఒడుదొడుకులకు లోనైనప్పటికీ లాభాల్లో కొనసాగింది. చివరికి  307.82 పాయింట్ల లాభంతో 48,176.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114.40 పాయింట్ల లాభంతో 14,132.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.02గా ఉంది. నిఫ్టీలో టాటా స్టీల్‌, హిందాల్కో, ఐషర్‌ మోటార్స్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు మినహా మిగిలిన షేర్లు రాణించాయి. ముఖ్యంగా లోహ, ఐటీ, ఆటో, ఫార్మా రంగ షేర్లు సూచీలను నడిపించాయి.

ఇవీ చదవండి..
జాక్‌మా ఎక్కడ?
కొవిషీల్డ్: కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని