బడ్జెట్‌ బూస్ట్‌.. మార్కెట్లు జూమ్‌ - Stock Market Update
close

Updated : 01/02/2021 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ బూస్ట్‌.. మార్కెట్లు జూమ్‌

ముంబయి: కేంద్రం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత కొన్ని రోజుల్లో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రకటించిన పథకాలతో మదుపర్లు సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ల దూకుడుకు కారణమైంది. అలాగే, ఆటో రంగానికి సంబంధించి కొత్త తుక్కు విధానం ప్రకటించడం మదుపరులను ఉత్సాహపరించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడమూ సెంటిమెంటును బలపరిచింది. ఎన్‌పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు వంటివి బ్యాంకింగ్‌ రంగ షేర్ల దూకుడుకు కారణమైంది. 

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1:46 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2,017 పాయింట్లు లాభపడి  48,303 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 551 పాయింట్ల లాభంతో 14,185 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతోంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, సిప్లా విప్రో షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని