Stock market : స్థిరీకరణ దిశగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు! - Stock market indices opened in Red
close

Published : 20/09/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market : స్థిరీకరణ దిశగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గతవారాన్ని నష్టాలతో ముగించాయి. ఆసియా మార్కెట్లు నేడు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. గత నాలుగు వారాలుగా రికార్డు స్థాయుల్లో దూసుకెళ్తున్న సూచీలు స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 137 పాయింట్లు నష్టపోయి 58,878 వద్ద.. నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 17,529 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.83 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని