Stock market: భారీ నష్టాల నుంచి లాభాల్లోకి - Stock market indices regained more than 850 pts
close

Updated : 21/06/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: భారీ నష్టాల నుంచి లాభాల్లోకి

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరకు లాభాల్లో ముగియడం విశేషం. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఓ దశలో ఏకంగా 889 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయం 51,887 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 51,740 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 230 పాయింట్ల లాభంతో 52,574 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగించింది. రోజులో 15,765-15,505 మధ్య కదలాడిన సూచీ చివరకు 63 పాయింట్లు లాభపడి 15,746 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.05 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడాయి. వీటితో పాటు దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీలు ఈరోజు తొలి భాగంలో నష్టాల బాటపట్టాయి. చివరకు ఇంధన, స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఇన్‌ఫ్రా రంగాల షేర్ల నుంచి మద్దతు లభించడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి. 

బీఎస్‌ఈ 30 సూచీలో ఎన్‌టీపీసీ, టైటన్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని