close

Updated : 05/05/2021 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 148 పాయింట్లు లాభపడి 48,401 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 51 పాయింట్లు ఎగబాకి 14,547 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.86 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఏడు మినహా మిగతా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ లాభాల్లో పయనిస్తుండగా.. బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫినాన్స్‌, నెస్లే ఇండియా, మారుతీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని