Stock market: నష్టాల్లో సూచీలు - Stock market indices trading slightly lower
close

Published : 31/05/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి.అనంతరం క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 218 పాయింట్లు దిగజారి 51,204 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 15,375 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.42 వద్ద కొనసాగుతోంది. గత వారపు భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఆసియా మార్కెట్లు వరుసగా మూడో వారమూ లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌ భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మారుతీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని