Stock market: లాభాలతో ముగిసిన సూచీలు - Stock markets Ended in green
close

Updated : 07/07/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాలతో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజులో కొంత మేర ఊగిసలాట ధోరణి కనబరచాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 52,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కానీ, ఒంటిగంట తర్వాత లోహ, స్థిరాస్తి, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లు పుంజుకోవడంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 193 పాయింట్లు లాభపడి 53,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు ఎగబాకి 15,879 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగియగా.. టైటన్‌, మారుతీ, రిలయన్స్‌, బజాజ్ ఫినాన్స్‌, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని