ఇక వెబ్‌ పోర్టల్‌లోనూ ఛానెళ్ల ఎంపిక - TRAI launches TV Channel Selector web portal
close

Published : 16/06/2021 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక వెబ్‌ పోర్టల్‌లోనూ ఛానెళ్ల ఎంపిక

దిల్లీ: టీవీ ఛానెళ్లను ఎంపిక చేసుకునేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్తగా టీవీ ఛానెల్‌ సెలక్టర్‌ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. గతేడాది జూన్‌ 25న ఇదే పేరుతో మొబైల్‌ యాప్‌ను ట్రాయ్‌ తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ లేనివాళ్లు, బ్రౌజర్‌ ద్వారా ఈ సేవలను పొందాలనుకునే వారి కోసం తాజాగా వెబ్‌ పోర్టల్‌ను మొదలు పెట్టింది.

టీవీ ఛానెల్‌ సెలక్టర్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా సబ్‌స్క్రైబర్లు తమ సబ్‌స్కిప్షన్‌ వివరాలు తెలుసుకోవచ్చు. తాము ఎంపిక చేసుకున్న ఛానెళ్లు, కేబుల్‌/డీటీహెచ్‌ ఆపరేటర్లు అందిస్తున్న బొకేల వివరాలు, నచ్చకపోయిన ఛానెళ్లను తొలిగించే సౌకర్యం వంటివి ఈ పోర్టల్‌ ద్వారా అందిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్‌ వివరాలను డౌన్‌లోడ్‌/ ప్రింట్‌ తీసుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. యూజర్లు ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇవ్వొచ్చని ట్రాయ్‌ పేర్కొంది. ప్రస్తుతం యాప్‌/వెబ్‌పోర్టల్‌తో కేబుల్‌ ఆపరేటర్లు, 16 డీటీహెచ్‌ ఆపరేటర్లు అనుసంధానం అయ్యారని, మిగిలిన వారిని తొందర్లో అనుసంధానం చేస్తామని ట్రాయ్‌ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని