close
Array ( ) 1

తాజా వార్తలు

వ్యక్తిగత రుణాలిస్తాం: బీఓబీ

ముంబయి: తమ వద్ద రిటైల్‌ (గృహ, వాహన, తనఖా) రుణాలు తీసుకుని, క్రెడిట్‌స్కోర్‌ 650 పైన ఉన్న ఖాతాదార్లకు, రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఇస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రకటించింది. అయిదేళ్ల కాలావధికి ఇచ్చే ఈ రుణాలపై 10.25 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని వెల్లడించింది. గృహరుణంలో 10 శాతం, వాహన రుణంలో 20 శాతాన్ని ఇలా మంజూరు చేస్తామని వివరించింది.కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల నగదు లభ్యత ఏర్పడటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమానికి రూ.76 కోట్లు: స్టార్‌బక్స్‌
కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులను సంరక్షించుకోవడం కోసం, 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.76 కోట్ల) నిధులు కేటాయిస్తున్నట్లు స్టార్‌బక్స్‌ ప్రకటించింది.  
ప్రత్యేక సేవల్లో 29 విమానాలు
దేశీయంగా లాక్‌డౌన్‌ వల్ల విమానాలన్నీ నిలిచిపోయాయి. అయితే ప్రత్యేక సేవలు, అత్యవసర సరకు, ఔషధాల సరఫరా నిమిత్తం 29  విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 20 విమానాలు ఎయిరిండియా, దాని అనుబంధ అలయన్స్‌ ఎయిర్‌ నిర్వహిస్తున్నవే. ఇండిగోకు ఉన్న 257 విమానాల్లో 2, స్పైస్‌జెట్‌కు ఉన్న 114 విమానాల్లో 7 ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి.  
పీఎం కేర్స్‌ నిధికి విరాళాలు
జేపీ గ్రూప్‌: రూ.3 కోట్లు
ఐఐటీ ఖరగ్‌పూర్‌: రూ.కోటి


మార్కెట్‌ కబుర్లు

* బహ్రెయిన్‌లోని మురుగు నీటి శుద్ధి ప్లాంటు కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన రూ.90 కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నట్లు వా టెక్‌ వాబాగ్‌ తెలిపింది.
* భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా పరాగ్‌ రాజాను నియమించినట్లు కంపెనీ వెల్లడించింది.

* కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ నెల 21న జరగాల్సిన కంపెనీ 33వ వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్‌) వాయిదా వేస్తున్నట్లు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తెలిపింది. సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామంది.

* బరౌనీ చమురు శుద్ధి ప్లాంటు సామర్థ్య విస్తరణకు సంబంధించి ఐఓసీ నుంచి రూ.2,500-5,000 కోట్ల పెద్ద కాంట్రాక్టును దక్కించుకున్నట్లు ఎల్‌అండ్‌టీ పేర్కొంది.

* కంపెనీ వార్షిక సాధారణ సమావేశాన్ని ఆగస్టు వరకు వాయిదా వేసుకుంటున్నట్లు ఏబీబీ తెలిపింది.

* ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 78 లక్షల టాటా కమ్యూనికేషన్‌ షేర్లను (సుమారు రూ.185 కోట్లు) ఫండ్‌ మేనేజర్‌ ఫిడిలిటీ బుధవారం విక్రయించింది.

* రూపాయి బాండ్ల జారీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్ల నిధుల్ని సమీకరించనున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది.

* వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు వీలుగా ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ డాబర్‌ తులసి డ్రాప్స్‌ను బుధవారం విడుదల చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.