close

Published : 22/01/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
20 ఏళ్లు..

రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.196 లక్షల కోట్లకు

బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 20 ఏళ్లలో 32 రెట్లు పెరిగింది. 2001-02 ఆర్థిక సంవత్సరం చివరకు బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ  రూ.6.12 లక్షల కోట్లు కాగా, 2020-21 జనవరి 21న రూ.196.51 లక్షల కోట్లకు చేరింది. 2021 జనవరి 12న జీవనకాల గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. ఆరోజు నమోదైన రూ.197.46 లక్షల కోట్లే ఇప్పటివరకు అత్యధికం.
* 2008 జనవరిలో 21,000 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్‌, ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అదే ఏడాది అక్టోబరు చివరకు 8700 పాయింట్లకు చేరింది. 2008-09 ఆర్థిక సంవత్సరం చివరకు నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.30 లక్షల కోట్లకు క్షీణించింది. 2007-08 ఆఖరుకు ఈ విలువ రూ.51 లక్షల కోట్లు. అయితే తదుపరి ఏడాది పుంజుకుని,  రెట్టింపైంది. ఇదేవిధంగా 2020 మార్చి ఆఖరులో కొవిడ్‌ సంక్షోభం చుట్టుముట్టడంతో, సెన్సెక్స్‌ 26000 పాయింట్లకు, కంపెనీల మార్కెట్‌ విలువ రూ.113 లక్షల కోట్లకు క్షీణించింది. 2018-19 ఆఖరులో ఈ విలువ రూ.151 లక్షల కోట్లు .
విదేశీ పెట్టుబడుల అండ
2020 అక్టోబరు నుంచి ఇప్పటివరకు విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సూచీలు రోజుకో కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ దూసుకెళ్లడానికి ఎఫ్‌ఐఐల పెట్టుబడులే ప్రధాన కారణం. గత మార్చిలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఎఫ్‌ఐఐలు  రూ.62 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో, సెనెక్స్‌ 25638 పాయింట్లకు కుదేలవ్వడం గమనార్హం.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని