close

Updated : 03/03/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.179 కోట్లు

సమీకరించిన ఎంటార్‌ టెక్నాలజీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తొలి పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) వచ్చిన హైదరాబాద్‌ కంపెనీ ఎంటార్‌ టెక్నాలజీస్‌, ఇష్యూ కంటే ముందు రోజు 15 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.178.92 కోట్లు సమీకరించింది. రూ.575 ధరకు 31,11,725 షేర్లను 2న ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో నొమురా ఫండ్స్‌ ఐర్లాండ్‌, జూపిటర్‌ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్‌, వైట్‌ ఓక్‌ కేపిటల్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ ఇండియా తదితర విదేశీ ఫండ్లు ఉన్నాయి. దేశీయ సంస్థలైన ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.70 కోట్లు, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ నేడు (ఈ నెల 3) ప్రారంభమై 5న ముగుస్తుంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని