close

Published : 06/03/2021 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు


ముంబయి: విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు వరుగా రెండో వారమూ పెరిగాయి. ఫిబ్రవరి 26తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 689 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5000 కోట్లు) పెరిగి 584.554 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.43.8 లక్షల కోట్లు)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. అంతకు ముందు వారంలో నిల్వలు 169 మి.డాలర్లు పెరిగి 583.865 బి.డాలర్లుగా నమోదయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 509 మిలియన్‌ డాలర్లు పెరిగి 542.615 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41 లక్షల కోట్లు)కు చేరాయి. బంగారు నిల్వలు 172 మిలియన్‌ డాలర్లు పెరిగి 35.421 బిలియన్‌ డాలర్లకు చేరాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 9 మి.డాలర్లు పుంజుకుని 1.517 బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. ఐఎంఎఫ్‌లో దేశ నిల్వల స్థానం స్వల్పంగా తగ్గి 5.001 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది.


 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని