close

Published : 05/05/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పన్ను పరిధిలోకి గూగుల్, ఫేస్‌బుక్‌!

ఆదాయం రూ.2 కోట్లు మించితే డిజిటల్‌ పన్ను
వినియోగదార్ల పరిమితి 3 లక్షలు
2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

సాంకేతిక కంపెనీలు ఇక భారత్‌లో పన్ను చెల్లించేలా రంగం సిద్ధమైంది. సరికొత్త లేదా సవరించిన చట్టం ప్రకారం.. ప్రవాస టెక్‌ కంపెనీలకు గరిష్ఠ పన్ను ఆదాయ పరిమితి రూ.2 కోట్లుగా; గరిష్ఠ వినియోగదార్లు 3 లక్షలుగా ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది. అంతకంటే ఎక్కువ ఆదాయం, వినియోగదార్లు ఉంటే పన్ను చెల్లించాలన్నమాట.

అప్పటి ఆర్థిక బిల్లులోనే..

2018-19 ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టిన సిగ్నిఫికెంట్‌ ఎకనమిక్‌ ప్రెసెన్స్‌(సెప్‌) మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన సగటు మొత్తం లేదా సగటు వినియోగదార్ల సంఖ్యను అధిగమించినపుడు అటువంటి లావాదేవీలన్నిటికీ పన్ను వర్తిస్తుంది. ప్రవాస కంపెనీ ఏదైనా భారత్‌లోని ఏ వ్యక్తితోనైనా లేదా వ్యక్తులతోనైనా జరిపే లావాదేవీల(వస్తువులు లేదా సేవలు)పై వచ్చే ఆదాయాన్ని దీనికి లెక్కిస్తామని, అదే విధంగా ఎంత మందితో వ్యాపార కార్యకలాపాలను అనుసంధానం చేశారన్నదీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1, 2022 నుంచి ఈ సవరణలు అమల్లోకి వస్తాయి.

పన్ను ఒప్పందాలను పునః చర్చించాలి

ప్రస్తుత ద్వంద్వ పన్ను రద్దు ఒప్పందాల పరిధిలోకి ప్రస్తుత ప్రతిపాదిత మార్పులు రావు. దీంతో ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి వాటిపై పన్నులు వేయాలంటే ప్రభుత్వం అమెరికాతో పన్ను ఒప్పందాల విషయంలో తిరిగి చర్చలు చేపట్టాలి. ప్రస్తుత ఒప్పందాలను సమీక్షించినపుడు లేదా కొత్తవాటిపై సంతకాలు చేసినపుడే భారత పన్ను పరిధిలో ఉన్న డిజిటల్‌ కంపెనీలు వస్తాయి.

విశ్లేషకులు ఏమంటున్నారంటే..

ప్రస్తుత పరిమితి చాలా తక్కువగా ఉండడంతో చాలా ప్రవాస కంపెనీలు సెప్‌ పరిధిలోకి వస్తాయి. కానీ ప్రస్తుత ఒప్పందాల్లో పర్మినెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(పీఈ) తరహా సంప్రదాయ విధానాల్లోనే ప్రవాసులపై పన్నులు విధిస్తున్నారు. చట్టంలో సెప్‌ను జత చేసినా.. పన్ను ఒప్పందాలను సవరిస్తేనే వాటిని సెప్‌ పరిధిలోకి తీసుకురాగలమ’ని విశ్లేషకులు అంటున్నారు. ‘ఒప్పంద దేశాల పౌరులు మాత్రం తమ ప్రయోజనాలను పొందొచ్చు. ఒప్పంద పరిధిలో లేని దేశాలకు చెందిన ప్రవాసులు పన్ను విషయంలో  సమీక్షించుకోవాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా భారత్‌ యత్నాలు

ప్రవాస డిజిటల్‌ కంపెనీలపై పన్నులు వేయాలని కొన్నేళ్లుగా భారత్‌ ప్రయత్నిస్తోంది. ఈక్విలైజేషన్‌ లెవీని తీసుకొచ్చింది. డిజిటల్‌ వ్యాపార ప్రకటనలపై దానిని అమలు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో రూ.2 కోట్ల టర్నోవరున్న ప్రవాస ఇ-కామర్స్‌ కంపెనీలపై 2 శాతం పన్ను విధించింది. 2021-22 ఫైనాన్స్‌ యాక్ట్‌లో దానిని మరింత విస్తృతం చేసింది. నాలుగేళ్ల కిందట మారిషస్, సింగపూర్, సైప్రస్‌ వంటి సున్నా లేదా తక్కువ పన్ను దేశాతో పన్ను ఒప్పందాలను సైతం భారత్‌ సవరించింది. 

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని