ఒక్కసారి ఛార్జింగుతో 125 కి.మీ. ప్రయాణం
close

Published : 16/06/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కసారి ఛార్జింగుతో 125 కి.మీ. ప్రయాణం

హాప్‌ ఎలక్ట్రిక్‌ నుంచి 2 ఇ-స్కూటర్లు

ముంబయి: విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం విపణిలోకి రెండు కొత్త ఇ-స్కూటర్లను తీసుకొచ్చింది. లియో, ఎల్‌వైఎఫ్‌ పేరుతో తీసుకొచ్చిన ఇ-స్కూటర్‌ల ధరలు వరుసగా రూ72,500, రూ.65,500గా నిర్ణయించింది. ఇంటర్నెట్, జీపీఎస్‌, మొబైల్‌ యాప్‌ను వీటికి అమర్చారు. 180 కేజీల వరకు బరువును తీసుకెళ్లేందుకు ఇవి అనువుగా ఉంటాయి.. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక త్వరలో విడుదల చేయబోయే ఇ-బైక్‌ ఓఎక్స్‌ఓ 100 ఒకసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ ప్రయాణించడమే కాకుండా గంటకు గరిష్ఠంగా 100 కి.మీ వేగం అందుకునేలా  మోటార్‌ను అమరుస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ కేతన్‌ మెహతా వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని