పసిడి సానుకూలమే..!
close

Published : 02/08/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి సానుకూలమే..!

కమొడిటీస్‌
ఈ వారం
బంగారం, వెండి

* పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం 50 వారాల చలన సగటైన రూ.48,775 స్థాయిని తాకే అవకాశం ఉంది. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.47,775 కంటే కిందకు వెళ్తేనే రూ.47,547; రూ.47,304 వరకు పడిపోతుందని భావించవచ్చు.

* వెండి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.68,188 కంటే పైన చలిస్తే రూ.69,031; రూ.69,604 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

  ప్రాథమిక లోహాలు

* రాగి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.742 కంటే దిగువన కదలాడకుంటే మరింతగా రాణించే అవకాశం ఉంటుంది.

* సీసం ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.179.35; రూ.180.95 దరిదాపులో అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.181.15 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

* జింక్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.251.80 కంటే ఎగువన కదలాడకుంటే మరింతగా దిద్దుబాటు అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.

* అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టుకు రూ.202.75కి స్టాప్‌లాస్‌ను సవరించుకొని లాంగ్‌ పొజిషన్లను కొనసాగించడం మంచిదే.

* నికెల్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.1,513 కంటే పైన చలించకుంటే కొంత దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు.

  ఇంధన రంగం

* ముడి చమురు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం కూడా సానుకూలంగానే కన్పిస్తున్నప్పటికీ.. రూ.5,651; రూ.5,694 స్థాయిల వద్ద కొంత అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకోవచ్చు.

* సహజవాయువు ఆగస్టు కాంట్రాక్టును రూ.311.60 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.286 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఆగస్టు కాంట్రాక్టును రూ.1,167 ఎగువన కొనుగోలు చేయడం మంచిదే.  

 వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.7,233 కంటే దిగువకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.

* జీలకర్ర ఆగస్టు కాంట్రాక్టు రూ.13,194 కంటే దిగువన చలిస్తే.. మరింతగా దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

* సోయాబీన్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.9,394 కంటే కిందకు రాకుంటే రూ.10,552 లక్ష్యంతో ధర తగ్గినప్పుడల్లా లాంగ్‌ పొజిషన్లు జతచేసుకోవచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని