‘ఎలిగ్జిబ్‌’పై అమెరికా, కెనడా హక్కులు
close

Published : 05/08/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎలిగ్జిబ్‌’పై అమెరికా, కెనడా హక్కులు

విక్రయించిన డాక్టర్‌ రెడ్డీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తీవ్రమైన పార్శ్వనొప్పిని అదుపు చేయడానికి వినియోగించే ఔషధమైన ఎలిగ్జిబ్‌ (సెలాకాక్సిబ్‌ ఓరల్‌ సొల్యూషన్‌) 25 ఎంజీ/ఎంఎల్‌ పై అమెరికా, కెనడా హక్కులను బయోడెలివరీ సైన్సెస్‌ ఇంటర్నేషనల్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ విక్రయించింది. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ బుధవారం వెల్లడించింది. ప్రతిఫలంగా డాక్టర్‌ రెడ్డీస్‌కు ఇప్పుడు 6 మిలియన్‌ డాలర్లు లభిస్తాయి. ఒక ఏడాది తర్వాత మరో 9 మి.డాలర్లు వస్తాయి. ‘మైల్‌స్టోన్‌  చెల్లింపుల’ కింద మరికొంత సొమ్ము లభించే అవకాశం ఉంది. ప్రజలకు ఇంతవరకూ అందుబాటులో లేని ఔషధాలను ఆవిష్కరించాలనే ఆలోచనకు ఎలిగ్జిబ్‌ ఒక ఉదాహరణగా డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరెక్‌ ఇజ్రాయెలి అభివర్ణించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని