రిటైల్‌ డిపాజిటర్లకు ప్రతిఫలం ఉండట్లేదు
close

Published : 22/09/2021 03:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిటైల్‌ డిపాజిటర్లకు ప్రతిఫలం ఉండట్లేదు

వడ్డీ ఆదాయంపై పన్నును సమీక్షించాలి
ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు

ముంబయి: రిటైల్‌ డిపాజిటర్లు తమ బ్యాంకు డిపాజిట్లపై ప్రతికూల ప్రతిఫలం పొందుతున్న నేపథ్యంలో, వడ్డీ ద్వారా పొందుతున్న ఆదాయంపై పన్నును సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. డిపాజిట్‌దారులందరికీ పన్ను విషయంలో వెసులుబాటు కల్పించలేకపోయినా, రోజువారీ అవసరాలకు వడ్డీ ఆదాయంపైనే ఆధారపడి జీవించే వయోవృద్ధులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలకు నేతృత్వం వహిస్తున్న సౌమ్య కాంతి ఘోష్‌ వెల్లడించారు. వ్యవస్థలో సుమారు రూ.102 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులు వార్షిక వడ్డీ ఆదాయం రూ.40,000 దాటితే మూలం వద్ద పన్ను కోతకు (టీడీఎస్‌) దిగుతున్నాయి. వయోవృద్ధుల విషయంలో రూ.50,000 ఆదాయం దాటితే టీడీఎస్‌ విధిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధిపై దృష్టి ఉండటంతో వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ పరిణామం డిపాజిటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. అందుకే వయో వృద్ధులు వడ్డీ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయ పరిమితిని పెంచి వారికి ఊరట కల్పించేందుకు ప్రయత్నించాలని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని