హెరిటేజ్‌ ఫుడ్స్‌కు రూ.33 కోట్ల లాభం
close

Published : 22/10/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెరిటేజ్‌ ఫుడ్స్‌కు రూ.33 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.670.3 కోట్ల ఆదాయాన్ని, రూ.32.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 9.9 శాతం పెరిగింది. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.2.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని యాజమాన్యం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదాయం రూ.1,318 కోట్లు, నికరలాభం రూ.63.1 కోట్లుగా ఉన్నాయి. కొవిడ్‌-19 ప్రభావం నుంచి కోలుకుని, మంచి ఆదాయాలు నమోదు చేయగలుగుతున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా కంపెనీకి ఉన్న అప్పును పూర్తిగా తీర్చివేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. హెరిటేజ్‌ డైరెక్టర్ల బోర్డులోకి ఎం.పి.విజయకుమార్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని