ఆఖర్లో అమ్మేశారు
close

Published : 28/10/2021 03:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఖర్లో అమ్మేశారు

డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ప్రభావం
సమీక్ష

రెండు రోజుల లాభాల తర్వాత సూచీలకు బుధవారం నష్టాలు ఎదురయ్యాయి. అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్‌ ఒడుదొడుకులు ఎదుర్కొంది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, బలహీన రూపాయి, మిశ్రమ కార్పొరేట్‌ ఫలితాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 75.03 వద్ద ముగిసింది. అమెరికా- చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు నీరసంగానే కదలాడాయి.
సెన్సెక్స్‌ ఉదయం 61,499.70 పాయింట్ల వద్ద జోరుగా ప్రారంభమై, ఇంట్రాడేలో 61,576.85 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీ నష్టాల్లోకి జారుకుని 60,989.39 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 206.93 పాయింట్ల నష్టంతో 61,143.33 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 57.45 పాయింట్లు కోల్పోయి 18,210.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,167.90- 18,342.05 పాయింట్ల మధ్య కదలాడింది.

* త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు కుదేలైంది. ఇంట్రాడేలో 6.7% పడ్డ షేరు రూ.785.80 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 6.52% నష్టంతో రూ.787.35 వద్ద ముగిసింది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.70%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.83%, హెచ్‌యూఎల్‌ 1.61%, టాటా స్టీల్‌ 1.49%, ఎన్‌టీపీసీ 1.40%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.11%, కోటక్‌ బ్యాంక్‌ 1.09%, నెస్లే 1.09%, రిలయన్స్‌ 1.08% మేర డీలాపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 4.42%, సన్‌ఫార్మా 1.45%, ఇన్ఫోసిస్‌ 1.44%, అల్ట్రాటెక్‌ 1.28%, ఎస్‌బీఐ 1.28%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.92% లాభపడ్డాయి.
* టీటీకే ప్రెస్టీజ్‌ షేర్ల విభజనకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.1 ముఖవిలువ కలిగిన 10 షేర్లుగా విభజిస్తారు. దీంతో షేరు 15.93 శాతం లాభంతో రూ.11185.30 వద్ద ముగిసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని