stock market: కొనసాగుతున్న లాభాలు - stock market indices are trading higher
close

Updated : 01/06/2021 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: కొనసాగుతున్న లాభాలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 245 పాయింట్లు ఎగబాకి 52,183 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 15,649 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.50 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, వ్యాక్సినేషన్‌ పురోగతి, కీలక కంపెనీలు రాణించడం సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 జాబితాలో బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫినాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని