close
యమహా-హీరో ‘ఇ సైకిల్‌’

దిల్లీ: లెక్ట్రో ఇ-సైకిల్‌ శ్రేణిని దేశీయ విపణిలోకి విడుదల చేసేందుకు జపాన్‌కు చెందిన యమహా మోటార్‌ కంపెనీతో జత కట్టినట్లు హీరో సైకిల్స్‌ మంగళవారం వెల్లడించింది. యమహా కంపెనీకి చెందిన ‘లెక్ట్రో ఈహెచ్‌ఎక్స్‌20’ ఇ-సైకిల్‌ ధర రూ.1.30 లక్షలని కంపెనీ తెలిపింది. ఆరోగ్యకర జీవనం, దేహ దారుఢ్యం కోసం అధిక వ్యయం చేస్తున్న అధికాదాయ  వర్గాలను లక్ష్యంగా చేసుకుని మెట్రో నగరాలలో ఈ ఇ-సైకిళ్లను విక్రయిస్తామని హీరో సైకిల్స్‌ వెల్లడించింది. సెంటర్‌ మోటార్‌తో తయారైన తొలి ఇ-సైకిల్‌ ఇదే. ఒకసారి 3.5 గంటలు ఛార్జి చేస్తే 60-70 కి.మీ వరకు నడిచే విధంగా దీన్ని రూపొందించారు. ట్రిపుల్‌ సెన్సార్‌ టార్క్‌ టెక్నాలజీ, వేగం, పదునైన పెడలింగ్‌ ప్రతిస్పందన/సహాయం, మెరుగైన శక్తి మద్దతు దీని సొంతం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.