close
షేర్లు.. ఆ తర్వాతే డిపాజిట్లు

ఈనాడు - హైదరాబాద్‌

డాదికి రూ.7 కోట్లు (10 లక్షల డాలర్ల) పెట్టుబడి పెట్టగలిగే శ్రీమంతులు 2017లో 2.63 లక్షల మంది ఉండగా, వీరందరి సంపద విలువ రూ.392 లక్షల కోట్లని కార్వీ వెల్ల్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక తెలిపింది. అదే 2018కి వచ్చేసరికి శ్రీమంతుల సంఖ్య 2.56 లక్షలకు తగ్గినా, వీరి సంపద విలువ మాత్రం రూ.430 లక్షల కోట్లని పేర్కొంది. సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని, సంపన్నులు మరింత శ్రీమంతులుగా మారుతుండగా, పేదలు నిరుపేదలుగా దిగజారుతున్నారని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, తాజా నివేదిక కూడా సంపన్నుల విషయంలో అంచనాలు నిజమేనని తేల్చింది.

* 2018లో పరిగణనలోకి తీసుకున్న శ్రీమంతుల మొత్తం సంపదలో రూ.262 లక్షల కోట్లు ఆర్థిక ఆస్తుల రూపంలోనే ఉన్నాయి. మిగిలింది భౌతిక ఆస్తులుగా ఉన్నాయి. వీటి శాతం 60:40గా చెప్పొచ్చు.

* ఆర్థిక ఆస్తుల్లో ఈక్విటీ మార్కెట్లలో నేరుగా రూ.52 లక్షల కోట్లు ఉన్నాయి. 2017లో ఈ విభాగ వృద్ధి 30.32 శాతం ఉండగా, 2018లో 6.39 శాతమే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సంపద వృద్ధి 13.45శాతం ఉండగా.. 2018-19లో ఇది 9.62శాతంగానే నమోదయ్యింది. గతంతో పోలిస్తే.. ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్న వారూ ఇప్పుడు పెరిగారని నివేదిక తెలిపింది. ఇప్పటి నుంచి ఏటా 13.19 శాతం వృద్ధితో వ్యక్తిగత సంపద 2024 కల్లా రూ.7,98,94,530 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

విశాఖ నుంచి పెరిగిన ఫండ్‌ పెట్టుబడులు: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు విశాఖపట్నం నుంచి గత ఏడాదితో పోలిస్తే 1.94శాతం పెరిగాయని కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ 2019 నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు వరకూ ఇక్కడ నుంచి మొత్తం పెట్టుబడులు రూ.5,200 కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి రూ.5,300 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడుల్లో ఆగస్టు నాటికి 4.32 శాతం వృద్ధి కనిపించింది. హైదరాబాద్‌లో గత ఆగస్టుతో పోలిస్తే పెట్టుబడుల్లో 5.39శాతం క్షీణత కనిపించింది. తెలంగాణ మొత్తంగా 5.65శాతం పెట్టుబడులు తగ్గాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.