Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు హనుమంత రావు. నేను దీర్ఘకాలం కోసం సిప్ లో ఒకే సరే మదుపు చేయాలనుకుంటున్నాను. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ లో ఎందులో రాబడి ఎక్కువగా వస్తుంది? సలహా ఇవ్వండి.        

Asked by S Hanumantha Rao on
మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసే విధానాలు రెండు - ఒకటి సిప్, మరొకటి లంప్సమ్. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) లో నెల నెలా నిర్ణీత మొత్తం మీ బ్యాంకు ఖాతా నుంచి తీసి ఫండ్ లో మదుపు చేస్తుంటారు. దానికి తగ్గ యూనిట్స్ మీ వద్ద చేరుతాయి. మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదురుకోవడానికి ఇది మంచి పధ్ధతి. మీ వద్ద పెద్ద మొత్తం లో డబ్బు ఉన్నట్టయితే 6 నెలల పాటు ఈ మొత్తాన్ని ఫండ్ లో మదుపు చేయవచ్చు.  మీ వీలు ని బట్టి పై వాటిలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో రిస్క్ కాస్త తక్కువ ఉంటుంది. ఈ ఫండ్ లో మీరు దీర్ఘకాలం లో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న