close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నమస్కారం. నా పేరు భాను ప్రకాశ్. నా వయసు 30 సంవత్సరాలు. నేను IT కంపెనీలో నెలకు రూ. 90000 జీతంతో పనిచేస్తున్నాను. ఇప్పటివరకు ఒక LIC పాలసీ రూ. 65000 ప్రీమియంతో చేశాను. ఇంకా పొదుపు మొదలు పెట్టలేదు. దయచేసి స్వల్పకాల, దీర్గకాల పెట్టుబడులకు సూచనలు ఇవ్వగలరు. ధన్యవాదములు.

Asked by భాను ప్రకాశ్ on
మీరు తీసుకున్న పాలసీ పేరు తెలుపలేదు. అయితే, చాలా వరకు ఎండోమెంట్, హోల్ లైఫ్, యూలిప్ లాంటి పెట్టుబడి తో కూడిన బీమా పథకాలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. వీటి బదులు బీమా హామీ కోసం ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.   పెట్టుబడి కోసం మీ రిస్క్ పరిమితి, లక్ష్యాల ఆధారంగా పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి, పెన్షన్), మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళ కోసం అయితే ఇండెక్స్ ఫండ్స్ మేలు. 

మరిన్ని

మీ ప్రశ్న