బాలికా.. నీ సాహసానికి సలాం.. - 15 Year Old Jalandhar Girl Fights Two Mobile Snatchers on Bike in This Viral Video
close
Updated : 03/09/2020 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలికా.. నీ సాహసానికి సలాం..

రాడ్‌తో దాడి చేస్తున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలిక

జలంధర్‌: ఆయుధంతో దాడి చేస్తున్నా దొంగలను వదలకుండా వారికి ఎదురొడ్డింది ఓ 15 ఏళ్ల బాలిక.పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లోని ఫతేపురి మొహల్లా ప్రాంతానికి చెందిన కుసుమ్‌ కుమారి(15) బయటకు వెళ్లి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. అంతలో ఆమె వెనుకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు బాలిక వద్ద ఉన్న ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. వెనుక కూర్చున్న వ్యక్తి రాడ్‌తో దాడి చేస్తూ సెల్‌ఫోన్‌ లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె అతడితో ధైర్యంగా పోరాడింది. అనంతరం పారిపోతున్న ఆ వ్యక్తిని బైక్‌ ఎక్కనీయకుండా నిలువరించింది. అతడు దాడి చేస్తున్నా ధైర్యంగా ఎదురొడ్డింది. ఇది చూసిన స్థానికులు ఆ దొంగను పట్టుకున్నారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం సదరు బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అవినాష్‌(22)గా గుర్తించారు. అతడిని పోలీసు స్టేషన్‌కి తరలించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా బాలిక ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పలువురు అభినందిస్తున్నారు. పోలీసు కమిషనర్‌ సైతం స్పందించారు. కుసుమ్‌ తెగువను కొనియాడారు. రాష్ట్ర, జాతీయ స్థాయి సాహస పురస్కారాలకు ఆమె పేరును సిఫార్సు చేయనున్నట్లు ప్రకటించారు. డీసీ ఘన్‌శ్యామ్‌ థోరి ఆమెకు రూ.51 వేల నగదు బహుమతి ప్రకటించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని