‘ఐదారేళ్ల తర్వాత ఒక్క తూటా పేల్లేదు’  - 1st time in 5-years loc is silent : army chief
close
Updated : 26/03/2021 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఐదారేళ్ల తర్వాత ఒక్క తూటా పేల్లేదు’ 

దిల్లీ: దాదాపు ఐదారేళ్ల తర్వాత మొదటిసారి జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తెలిపారు. ఈ మార్చి నెలలో ఒక్కటంటే ఒక్క తూటా కూడా అక్కడ పేలలేదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుదేశాలు పాటిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయితే పాకిస్థాన్ వైపు ఉగ్రవాదుల లాంచ్‌ ప్యాడ్స్‌ అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. భారత లక్ష్యం ఉగ్ర మూలాలను అంతమొందించడమేనని, పొరుగు దేశం ఉగ్రవాదానికి మద్దుతు ఇవ్వడం ఆపేస్తేనే టెర్రరిజాన్ని అరికట్టవచ్చన్నారు. పాక్‌లో నెలకొన్న అంతర్గత సమస్యల వల్లే కాల్పుల విరమణ ఒప్పందానికి ఆ దేశం ఒప్పుకుందనన్నారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడాలని గత నెలలో ఇరుదేశాల మిలటరీ కార్యకలాపాల డైరెక్టర్స్‌ జనరల్స్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇదీ ‘‘గతాన్ని పాతిపెట్టే సమయం’’ అని వ్యాఖ్యానించారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని