దీపావళికి టేకాఫ్‌ కానున్న సూర్య - Aakaasam Nee Haddhu Raa Release Date Confirmed Finally
close
Published : 24/10/2020 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళికి టేకాఫ్‌ కానున్న సూర్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సాఫీసు హిట్‌లతో సంబంధం లేకుండా కొత్త తరహా సినిమాలను చేసే నటుడు సూర్య. ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ఆకాశమే నీ హద్దురా!. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అక్టోబర్‌ 30న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ, ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా సూర్య వెల్లడించారు. ఈ సినిమా ఏవియేషన్‌ పరిశ్రమకు చెందిన కథాంశంతో రూపొందుతోంది. అందువల్ల భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌(ఎన్‌వోసీ) లభించకపోవడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం ఐఏఎఫ్‌ నుంచి సినిమాకు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఫలితంగా సినిమా విడుదలకు ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ‘ఆకాశమే నీ హద్దురా’ను దీపావళికి విడుదల చేస్తారని  కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

థియేటర్‌లు మూసి ఉండటంతో ఓటీటీలో విడుదల అవుతున్న మొదటి భారీ బడ్జెట్‌ చిత్రమిదే. ఎయిర్ డెక్కన్‌ వ్యవస్థాపకుడైన జీఆర్‌ గోపినాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అపర్ణ బాల మురళి, పరేష్ రావల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని