నిన్ను కాపాడుకోలేకపోయా నాన్నా: రాయ్‌లక్ష్మీ - Actress raai laxmi father passes away actress breaks down.. sorry i could not save you dad
close
Published : 08/11/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిన్ను కాపాడుకోలేకపోయా నాన్నా: రాయ్‌లక్ష్మీ

బరువెక్కిన హృదయంతో నటి పోస్ట్‌

హైదరాబాద్‌: కథానాయిక రాయ్‌ లక్ష్మీ తండ్రి రామ్‌ రాయ్‌ కన్నుమూశారు. తన నాన్నను బతికించుకోలేకపోయానంటూ ఆమె సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కన్నతండ్రి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ‘డాడ్‌.. ఐ మిస్‌ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను. ఈ లోటుతోనే జీవించేందుకు ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినట్లు మరెవరూ ప్రేమించలేదు. మా నాన్న ఇకలేరని చెబుతుంటే.. నా గుండె ముక్కలు అవుతోంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను డాడీ. కానీ రక్షించుకోలేకపోయినందుకు క్షమించండి’.

‘అంతా సజావుగా జరుగుతుందని చెప్పడానికి పక్కనే మీరు ఉంటే బాగుండేదని నా మనసు చెబుతోంది. మీరే నా బలం, జీవితంలో నాకు ఏం కావాలన్నా ఇచ్చారు. నేను మీ కుమార్తెను కావడం నా అదృష్టం. నేనెప్పుడూ స్వేచ్ఛగా, దృఢంగా ఉండాలని మీరు ఎందుకు కోరుకునేవారో అర్థమైంది. ఏదో ఒక రోజు మీరులేని లోటును నేను భరించాలని, తట్టుకోవాలని అలా చెప్పేవారు. ఇప్పుడు మీరు.. నొప్పి, బాధలేని ప్రశాంతమైన చోటులో ఉన్నారని నా మైండ్‌కు తెలుసు. దీన్ని నా మనసుకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. మీరు పై నుంచి నన్ను ఆశీర్వదిస్తారని, ముందుకు నడిపిస్తారని నాకు తెలుసు. మీరు నన్ను నమ్మారు. మీరు కోరిన కోర్కెను మీ చిట్టి కూతురు తప్పకుండా నెరవేరుస్తుంది, మీరు గర్వించేలా చేస్తుంది. బంగారు మనసున్న వ్యక్తి హృదయం కొట్టుకోవడం ఆపేసింది.. ఇది నా జీవితంలోనే అంధకారంతో కూడుకున్న సమయం. ఆయన ఇంత నొప్పిని భరించడం ఇష్టంలేక దేవుడు తనతో తీసుకెళ్లాడు. మా నాన్న ఎప్పుడూ మాతోనే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మేం ఎంతో మిస్‌ అవుతున్నాం. ఐ లవ్‌ యూ..’ అని రాయ్‌ లక్ష్మి బరువెక్కిన హృదయంతో రాశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని