close

తాజా వార్తలు

ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!

ముంబయి: తన ముద్దు మాటలు, ఆకట్టుకునే స్టైల్‌తో ఎందరో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌. అయితే స్టైల్‌పరంగా ఓ టాలీవుడ్‌ స్టార్‌ ఈ బ్యూటీనే మెప్పించారు. ఈ బాలీవుడ్‌ భామ ఇష్టపడిన ఆ టాలీవుడ్‌ హీరో ఎవరనుకుంటున్నారు. మన విజయ్‌ దేవరకొండ. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా ఓ ఫ్యాషన్‌ షోలో చెప్పారు.

ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు నటి ఆలియాభట్‌. తాజాగా ఆమె ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. ఈ ఏడాది స్టైల్‌పరంగా మీకు బాగా నచ్చిన నటీనటులు ఎవరు? అని ఓ విలేకరి ఆమెను ప్రశ్నించగా.. ‘హీరోయిన్స్‌లో అయితే అనుష్క శర్మ.. తను నాకెప్పటికీ ఫెవరెట్‌. అలాగే విజయ్‌ దేవరకొండ. తన స్టైల్‌ అద్భుతంగా ఉంటుంది’ అని ఆలియా తెలిపారు.

సినిమాలతోపాటు ఫ్యాషన్‌లో కూడా తనదైన ముద్ర వేసుకున్న టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ. ఈ ఏడాది విడుదలైన  ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మిశ్రమ ఫలితాలను అందుకున్న ఈ నటుడు ప్రస్తుతం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు ఆయన పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా చేస్తున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.