close

తాజా వార్తలు

Updated : 28/11/2020 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఫైటర్‌’ గురించి అనన్య కామెంట్‌..!

ముంబయి‌: ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌-2’ చిత్రంతో కథానాయికగా వెండితెరపై మెరిశారు నటి అనన్యపాండే. తన అందం, అమాయకత్వపు చూపుల్తో మొదటి చిత్రంతోనే ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పూరీ-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రానున్న ‘ఫైటర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తోంది అనన్య. ఈ నేపథ్యంలో తాజాగా అనన్య.. తన తదుపరి చిత్రాల గురించి స్పందించింది. అలాగే, ఇప్పుడిప్పుడే  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నానని చెబుతోంది.

‘నటిగా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించాను. నా కెరీర్‌కు ఇది ప్రారంభదశ. కొంతమంది నాపై చూపిస్తున్న అమితమైన అభిమానానికి సంతోషిస్తున్నా. ఇప్పుడిప్పుడే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సైతం పెంచుకుంటున్నాను. అలాగే, నా తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. దీపికా పదుకొణె, సిద్దార్థ్‌ చతుర్వేది కీలకపాత్రల్లో నటిస్తున్న ఓ సినిమాలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. కథానాయికగా తెలుగుతెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఫైటర్‌’. విజయ్‌ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం.. ఓ విభిన్నమైన ప్రపంచం.’ అని అనన్య వివరించారు. అంతేకాకుండా ‘ఫైటర్‌’ చిత్రంలోని పాత్ర తనకెంతో నచ్చిందంటూ చెప్పుకొచ్చిందీ భామ.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని