తేజస్వీ.. ముందు ఆ విషయం మాట్లాడు: నడ్డా - BJP Chief JP Nadda speech in Bihar election Rally
close
Published : 05/11/2020 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తేజస్వీ.. ముందు ఆ విషయం మాట్లాడు: నడ్డా

దర్భంగా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరుగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. మలి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దర్భంగాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విధ్వంసకర ఆలోచన కల్గిన సీపీఐ(ఎంఎల్‌)తో ఆర్జేడీ, కాంగ్రెస్‌ చేతులు కలిపాయని విమర్శించారు. గతంలో 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆర్జేడీ అరాచకాన్ని వ్యాప్తి చేసిందని, ఇందుకు బిహార్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మహా కూటమి అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటోన్న తేజస్వీ యాదవ్‌.. ముందు తన తండ్రి హయాంలో బలవంతంగా వలసపోయిన 25 లక్షల మంది గురించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ప్రధానిని విమర్శించాలనే తపనే తప్ప జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఆయన గ్రహించడంలేదని విమర్శించారు.

ఈ ఎన్నికలు కేవలం ఒక అభ్యర్థికి ఓటు వేయడానికి కాదని, బిహార్‌ భవిష్యత్తుకు సంబంధించినవని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిహార్‌ అభివృద్ధి కోసం పనిచేసేవారు ఓ వైపున ఉంటే.. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లేవారు మరో వైపున ఉన్నారన్నారు. మోదీ అభివృద్ధి మంత్రం.. మహాకూటమి కూడా బలవంతంగా ఈ అంశంపై మాట్లాడేలా చేసిందన్నారు. ఉజాలా పథకం కింద దేశ వ్యాప్తంగా 37 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేస్తే.. ఒక్క బిహార్‌లోనే 1.95 కోట్ల బల్బులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రధాని మోదీ బిహార్‌ను లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు)  శకం నుంచి ఎల్‌ఈడీ శకానికి తీసుకెళ్లారన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని