‘రాధేశ్యామ్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..! - Beets Of Radheshaym OUt Now
close
Updated : 21/10/2020 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలయ్యింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా కనిపించనున్నారు. ప్రభాస్‌ పుట్టినరోజును(అక్టోబర్‌ 23) పురస్కరించుకుని ‘రాధేశ్యామ్‌’ సినిమాలో ఆయన లుక్‌ను‌ తెలియజేసేలా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ రావడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. అలనాటి తార భాగ్యశ్రీ, సత్యరాజ్‌, జగపతిబాబు, జయరాం ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని