Maha samudram: చెప్పకే ఊసుపోని మాటలు... - Cheppake cheppake lyrical song from Maha samudram
close
Updated : 07/09/2021 06:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maha samudram: చెప్పకే ఊసుపోని మాటలు...

సిద్ధార్థ్‌, శర్వానంద్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథా  నాయికలు. జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అక్టోబర్‌ 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులోని ‘చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు...’ అంటూ సాగే పాటని నాయిక రష్మిక మందన్న విడుదల చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరకల్పనలోని  ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్‌ రచించగా, దీప్తి పార్థసారథి ఆలపించారు. ‘‘కథానాయకులతోపాటు... నాయిక అదితిరావు హైదరీ కలిసి కనిపిస్తున్న ‘చెప్పకే చెప్పకే’ లిరికల్‌ వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ప్రేమ, యాక్షన్‌ అంశాలతో కూడిన డ్రామాగా రూపొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. దీనికి ఛాయాగ్రహణం: రాజ్‌ తోట.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని