‘రూ.2 కోట్ల పరిహారం.. పిటిషన్‌ కొట్టివేయండి’ - Civic body asks court to dismiss kangana Plea Demanding Rs 2 cr as Compensation
close
Updated : 19/09/2020 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రూ.2 కోట్ల పరిహారం.. పిటిషన్‌ కొట్టివేయండి’

హైకోర్టును కోరిన బీఎమ్‌సీ

బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌: తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎమ్‌సీ) రూ.2 కోట్లు నష్ట పరిహారంగా ఇవ్వాలని బాలీవుడ్ కంగనా రనౌత్‌ ముంబయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చట్టపరంగా చేపట్టిన కూల్చివేతకు నష్టపరిహారం చెల్లించమని కోరుతూ కంగన చట్టాన్ని అవమానించారని బీఎమ్‌సీ హైకోర్టుకు విన్నవించింది. నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కంగనా వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని శుక్రవారం కోర్టును కోరింది. చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్‌ వేసినందుకు ఆమెకు జరిమానా విధించాలని కోరింది. దీనికపై కంగన ఇంకా స్పందించలేదు.

సెప్టెంబరు 9న ముంబయిలోని పాలీ హిల్‌లో ఉన్న కంగన కార్యాలయాన్ని బీఎమ్‌సీ అధికారులు కూల్చారు. భవనంలోని గోడల్ని దాదాపు నేలమట్టం చేశారు. దీన్ని చట్టవిరుద్ధంగా నిర్మించారంటూ సెప్టెంబరు 8న అధికారులు కంగనకు నోటీసులు జారీ చేశారు. సమాధానం చెప్పాలని ఒక్కరోజు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె కూల్చివేతపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇంతలోనే సెప్టెంబరు 9న అధికారులు కూల్చివేత చేపట్టారు. తన ఆఫీసును చట్టవిరుద్ధంగా నిర్మించలేదని కంగన ఆరోపించారు. దీనిపై శుక్రవారం బీఎమ్‌సీ అధికారులు కోర్టుకు తమ వాదన వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ‘నాకు ఆర్థికంగా, మానసికంగా నష్టం జరగడానికి కారణమైన బీఎమ్‌సీ పరిహారం చెల్లించాలి. నా సొంత శ్రమతో ఆ కార్యాలయాన్ని నిర్మించుకున్నాను’ అని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని