ప్లాస్మాదానం చేసిన మొదటి కేంద్ర మంత్రి ఆయనే! - Dharmendra Pradhan donates plasma
close
Updated : 04/10/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్లాస్మాదానం చేసిన మొదటి కేంద్ర మంత్రి ఆయనే!

దిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం ప్లాస్మా దానం చేశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన ప్లాస్మా దానం చేసిన మొదటి కేంద్రమంత్రిగా నిలిచారు. మహమ్మారిని జయించిన ప్రజలు కూడా ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేయడం తనకు చాలా సంతృప్తి కలిగించిందన్నారు. మహమ్మారిని జయించిన తరువాత ప్లాస్మా దానం చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కరోనా సోకిన తరువాత దాని నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో కొవిడ్‌ -19కు సంబంధించిన యాంటీబాడీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ యాంటీబాడీలు ఉన్న ప్లాస్మాను ఇవ్వటం వల్ల కొవిడ్‌తో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని