ప్రియమణి మాటలతో స్టేజ్‌పైనే ఏడ్చేసిన రష్మి - Dhee Champions Quarter Finals latest Promo
close
Updated : 30/10/2020 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియమణి మాటలతో స్టేజ్‌పైనే ఏడ్చేసిన రష్మి

హైదరాబాద్‌: మహిళలపట్ల పలువురు పురుషులకున్న అభిప్రాయాల్ని ప్రియమణి తెలియజేయగానే నటి రష్మి ఏడ్చేశారు. ప్రియమణి, పూర్ణ, శేఖర్‌ మాస్టర్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ ఛాంపియన్స్‌’. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ షో ఇటీవల క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. దీంతో సెమీస్‌లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్‌ అందరూ పోటాపోటీగా తలపడుతున్నారు.

వచ్చేవారం ప్రసారం కానున్న ‘ఢీ’ ఎపిసోడ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలయ్యింది. సుధీర్‌-రష్మి, ఆది-వర్షిణీల టీమ్స్‌కు చెందిన పలువురు కంటెస్టెంట్స్‌ తమ డ్యాన్స్‌తో న్యాయనిర్ణేతలను ఫిదా చేశారు. ఇందులో భాగంగా ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ సాంగ్‌కు ఓ కంటెస్టెంట్‌ చేసిన పెర్ఫామెన్స్‌ ఆకట్టుకుంది. కొంతమంది మనుషులు డబ్బు వ్యామోహంతో అనుబంధాలను సైతం ఎలా మర్చిపోతున్నారనే విషయాన్ని ఈ పాట ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.

‘మగువా మగువా’ అనే సాంగ్‌కు చేసిన గ్రూప్‌ పెర్ఫామెన్స్‌తో సెట్‌లో ఉన్న ప్రియమణి, పూర్ణ, రష్మి, వర్షిణితోపాటు ఇతర మహిళలు సైతం ఎమోషనల్‌ అయ్యారు. పెర్ఫామెన్స్‌ చివర్లో ప్రియమణి మాట్లాడుతూ.. ‘సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల గురించి ఇటీవల ఓ వ్యక్తి పలువురు పురుషుల్ని సోషల్‌మీడియా వేదికగా ఇంటర్వ్యూ చేశాడు. అందులో ఒకాయన మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లు ఎందుకు పనిచేయాలి? శరీరం కనిపించేలా పొట్టి దుస్తులు ఎందుకు ధరించాలి? వాళ్లు ఇంట్లోనే ఉంటే ఇలాంటివి జరగవు’ అని సమాధానమిచ్చాడు. ఆయన ఒక్కడే కాదు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలామంది మగవాళ్లు అదే సమాధానమిచ్చారు’ అని చెప్పి ప్రియమణి ఎమోషనల్‌ అయ్యారు. దీంతో అక్కడే ఉన్న రష్మి, వర్షిణి కన్నీరు పెట్టుకున్నారు. నవంబర్‌ 4న(బుధవారం) రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్‌’ ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని