‘పుష్ప’ కోసం నటి భారీ డిమాండ్? - Dishapatani Demands Huge Amount For PUSHPA Spl Song
close
Published : 31/12/2020 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పుష్ప’ కోసం నటి భారీ డిమాండ్?

ఒక్కపాట కోసం అంత అమౌంటా

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో పుష్పపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఆర్య’లో ‘అ అంటే అమలాపురం’, ‘ఆర్య-2’లో ‘రింగ రింగా’ ఐటెమ్‌ సాంగ్స్‌ ప్రేక్షకుల్ని ఎంతో అలరించాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’లో సైతం ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఐటెమ్‌ సాంగ్‌లా కాకుండా సినిమాకు తగ్గట్టు కొంచెం ఫోక్‌ బీట్‌తో స్పెషల్‌ సాంగ్‌ను ఈ సినిమా కోసం చిత్రీకరించనున్నారట. అయితే, ఈ పాట కోసం బాలీవుడ్‌ నటి దిశాపటానీని ‘పుష్ప’ టీమ్‌ సంప్రదించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఈ పాట కోసం ఆమె రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేశారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు కరోనా కారణంగా వాయిదా పడిన ‘పుష్ప’ షూట్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అరకులో చిత్రీకరించనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి

గుడ్‌బై 2020.. పార్టీకి వేళాయరా..!

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని