తొలి టీకా వేయించుకున్న 90ఏళ్ల బామ్మ - First patient in UK receives Pfizer Covid 19 vaccine
close
Updated : 08/12/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి టీకా వేయించుకున్న 90ఏళ్ల బామ్మ

లండన్‌: ప్రపంచంలోనే కొవిడ్‌ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన 90ఏళ్ల బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్‌ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ తొలి టీకా‌ వేయించుకున్నారు. ఫైజర్‌ టీకాకు క్లినికల్‌ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా‌ తీసుకున్న తొలి వ్యక్తి ఈమే కావడం విశేషం. ఇంకో విషయమేంటంటే.. మరో వారంలో ఈ బామ్మ 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారట. ఈ సందర్భంగా మార్గరెట్‌ మాట్లాడుతూ.. ‘మొట్టమొదటి టీకా తీసుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉంది. నా పుట్టినరోజుకు పొందిన గొప్ప బహుమతి ఇదే. ఈ ఏడాదిలో చాలా వరకు నేను ఒంటరిగానే గడిపాను. త్వరలోనే నా కుటుంబం, స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేందుకు ఎదురుచూస్తున్నా’ అని సంతోషంగా చెప్పారు. 

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం నుంచి బ్రిటన్‌లో టీకా పంపిణీ మొదలుపెట్టారు. తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు కేర్‌ హోంలో ఉండే వర్కర్లకు  ఇవ్వనున్నారు. 

యూకేతో పాటు ఫైజర్‌ అమెరికాలో కూడా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం డిసెంబరు 10న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ యూఎస్‌లో కూడా అనుమతి లభిస్తే.. డిసెంబరు మూడోవారం నుంచి అగ్రరాజ్యంలో టీకా పంపిణీ చేయాలని ఫైజర్‌ భావిస్తోంది. అటు భారత్‌లోనూ టీకా అనుమతి కోసం ఫైజర్‌ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

భారత్‌లో టీకా: 2 వారాల్లో అనుమతులు?

టీకా అందజేతలో మొబైల్‌ సాంకేతికత: మోదీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని