రండి.. గుంటూరుతో ప్రేమలో పడండి - Guntur Song From Middle Class Melodies
close
Published : 09/11/2020 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రండి.. గుంటూరుతో ప్రేమలో పడండి

హైదరాబాద్‌: ‘రండి.. గుంటూరు నగరంతో ప్రేమలో పడండి’ అని అంటున్నారు నటుడు ఆనంద్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. వర్ష బొలమ్మ కథానాయిక. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 20న అమెజాన్‌ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది.

తాజాగా ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రం నుంచి ‘గుంటూరు’ అంటే సాగే పాటను చిత్రబృందం సోమవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. గుంటూరు నగరాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని తెలియజేస్తూ ఈ పాటను రచించారు. అంతేకాకుండా గుంటూరులోని పలు ప్రాంతాల్లో దొరికే పసందైన వంటకాల గురించి కూడా ఈ పాట ద్వారా తెలియజేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని