ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం - Hong Kong has banned Air India and Vistara flights from October 17 to 30
close
Published : 18/10/2020 02:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం

దిల్లీ: ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ మరోసారి నిషేధం విధించింది. ఇవాళ్టి నుంచి అక్టోబర్‌ 30 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్‌ వెల్లడించింది. కరోనా సమయంలో ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించడం ఇది మూడోసారి. గతంలో ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు, ఆ తర్వాత సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 31 వరకు నిషేధం విధించింది.

మరోవైపు తాజాగా టాటా సియా సంస్థ నడుపుతున్న విస్తారా విమానాలను కూడా అనుమతించబోమని హాంకాంగ్‌ వెల్లడించింది. కరోనా విపత్కర సమయంలో విస్తారా విమానాలను ఆ దేశం నిషేధించడం ఇదే తొలిసారి. గత జులైలో అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు కనీసం ప్రయాణానికి 72 గంటల మందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. నెగటివ్‌ రిపోర్టు వచ్చిన వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు. అయితే దిల్లీ నుంచి హాంకాంగ్‌ వెళ్లిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు గురువారం తేలింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇటీవల హాంకాంగ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఇక్కడి వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, కజకిస్థాన్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణాఫ్రికా, అమెరికా తదితర 9 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కొవిడ్ నెగటివ్ ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ బయలుదేరక ముందే విమానాశ్రయ సిబ్బంది హాంకాంగ్‌ అధికారులకు సమాచారమివ్వాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్‌ నుంచి విదేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా మారుతుండటంతో  ఆయా దేశాల పరస్పర అంగీకారంతో విమాన సర్వీసులను నడుపుకొనే వీలుంది. ఈ మేరకు ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా దాదాపు 17 దేశాలకు భారత్‌ విమానాలు నడుపుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని