close

తాజా వార్తలు

సల్మాన్‌కు నో చెప్పిన ఇలియానా

ముంబయి: గోవా బ్యూటీ ఇలియానా.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు నో చెప్పారట. ఈ విషయాన్ని ఇలియానానే స్వయంగా చెప్పారు. ‘దేవాదాస్‌’, ‘పోకిరి’, ‘కిక్‌’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ.. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్‌ చిత్రాల్లో కూడా నటించారు. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘పాగల్‌పంతీ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇలియానా తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘వాంటెడ్‌’, ‘కిక్‌’ సినిమాల్లో నటించాలని మొదట తనను అడిగారట. కాకపోతే ఆ సమయంలో తాను వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల సల్మాన్‌ చిత్రాలకు నో చెప్పానని చెప్పుకొచ్చారు. అయితే ఇలియానా నో చెప్పిన రెండు చిత్రాలు కూడా తెలుగు చిత్రాలకు రీమేక్‌లు కావడం విశేషం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.