తొలి టీకానే ఉత్తమం కానవసరం లేదు.. - Important to have large basket of COVID-19 vaccine candidates
close
Updated : 05/12/2020 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి టీకానే ఉత్తమం కానవసరం లేదు..

దిల్లీ: దేశంలో అందుబాటులోకి రానున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్లలో  ఏది ఉత్తమమో, ఏది అన్ని విధాల సరిపడేదో తెలుసుకునేందుకు అనేక వ్యాక్సిన్లను పరీక్షించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీఓబీ) సెక్రటరీ రేణు స్వరూప్‌ సూచించారు. వివిధ సంస్థలు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాలు వేటికవే తమవైన లాభనష్టాలను కలిగి ఉన్నాయన్నారు. మొట్టమొదట లభించిందే ఉత్తమమైనది కావాల్సిన అవసరం లేదని.. తరువాత అందుబాటులోకి వచ్చే టీకా మరింత మంచిదయ్యే అవకాశం లేకపోలేదని  ఆమె విశ్లేషించారు. వాటిలో ఏది మంచిదనేది ఇప్పుడే వెల్లడించటం కష్టసాధ్యమని వివరించారు.

ఓ ఆన్‌లైన్‌ సెమినార్‌ సందర్భంగా డీఓబీ సెక్రటరీ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం 30 కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు కొనసాగు తున్నాయన్నారు. వాటిలో  సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మూడో దశ ప్రయోగాల్లో ఉండగా.. భారత్‌ బయోటెక్‌ కూడా మూడోదశ ప్రయోగాల్లోకి ప్రవేశించిందని అధికారిణి వివరించారు. మరో ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలాకు ఇటీవలే అనుమతులు లభించాయి.

వ్యాక్సిన్‌తయారీ అనేది నిజానికి సంక్లిష్టమైన విధానమని.. ఇందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైతుందని రేణు స్వరూప్‌ అన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలను గమనించేందుకు డీబీటీ దేశ, విదేశాలకు చెందిన ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిందని ఆమె తెలిపారు. ఈ కమిటీ ప్రతి రెండు వారాలకు ఒకసారి సమావేశమై దేశంలో కొవిడ్‌ టీకా పురోగతిని గురించి సమీక్ష జరుపుతుందని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని