పక్కా మిడిల్‌క్లాస్‌ అబ్బాయిగా నాగచైతన్య - Naga Chaitanya looks like perfect middleclass person
close
Published : 23/11/2020 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పక్కా మిడిల్‌క్లాస్‌ అబ్బాయిగా నాగచైతన్య

హైదరాబాద్‌: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ సినిమాకు ప్రేమకథల మాంత్రికుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇదిలా ఉండగా.. నేటితో 34వ వసంతంలోకి అడుగుపెడుతున్న నాగచైతన్యకు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘లవ్‌స్టోరీ’ సినిమా పోస్టర్‌ను సమంత విడుదల చేసింది. ట్విటర్‌ వేదికగా తన భర్త నాగచైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. పోస్టర్‌ను పోస్టు చేసింది. అందులో నాగచైతన్య లుంగీ, బనియన్‌తో పక్కా మధ్యతరగతి యువకుడిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ సాయిపల్లవి కూడా పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంది. నటుడు సుశాంత్‌తో పాటు డైరెక్టర్‌ బాబీ ట్విటర్‌ వేదికగా చైతూకి శుభాకాంక్షలు చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని