భీష్మ దర్శకుడికి నితిన్‌ ఖరీదైన బహుమతి! - Nithin Gifts Luxury Car to Director Vamshi Kudumula
close
Published : 10/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భీష్మ దర్శకుడికి నితిన్‌ ఖరీదైన బహుమతి!

హైదరాబాద్‌: ‘లై’, ‘చ‌ల్ మోహ‌న్ రంగా’, ‘శ్రీనివాస‌క‌ళ్యాణం’ వంటి వరుస పరాజయాలను చవిచూసిన యువ కథానాయకుడు నితిన్‌.. చాలా రోజులు గ్యాప్‌ తీసుకుని నటించిన చిత్రం ‘భీష్మ’. సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నితిన్‌కు జంటగా రష్మిక నటించారు. అయితే, ఎన్నో రోజుల తర్వాత తనకు మంచి హిట్‌ అందించినందుకు వెంకీకి నితిన్‌ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. మంగళవారం వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రేంజ్‌ రోవర్‌ కారును బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని వెంకీ కుడుముల ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కారు ఫోటోను షేర్‌ చేస్తూ ‘ఉత్తమమైన వ్యక్తితో మంచి సినిమాలు చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంత మంచి బహుమతిని పుట్టినరోజు కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు నితిన్‌ అన్నా’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం నితిన్‌ ‘రంగ్‌ దే’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని