ప్రభాస్‌ అలా ఉండడు: పూజా హెగ్డే  - Prabhas is not shy at all really says pooja hegde
close
Updated : 07/11/2020 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ అలా ఉండడు: పూజా హెగ్డే 

హైదరాబాద్‌: ‘ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువని అందుకే బయట కనిపించరని అందరూ అనుకుంటారు కానీ, ఆయన చాలా సరదాగా ఉంటారు’ అని అంటోది కథానాయిక పూజా హెగ్డే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల ఇటలీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే ఈ సినిమా గురించి ముచ్చటించారు. కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తల మధ్య చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. ‘ఇటలీలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు భౌతిక దూరం పాటించాం. ముందు జాగ్రత్తగా ఐదు రోజులకొకసారి కరోనా పరీక్షలు చేసేవారు. ఇలాంటి కష్టకాలంలో విదేశాల్లో చిత్రీకరణకు అనుమతి తీసుకోవడం ఎంతో కష్టం. సెట్‌లో ఎప్పుడూ మాస్కులు ధరించి ఉండేవాళ్లం. నేను మేకప్‌ వేసుకుని ఉండటం వల్ల మాస్కు పెట్టుకోవడం, తీయడం సమస్యగా అనిపించేది. ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువని అందరూ అనుకుంటారు. కానీ అతడు అలా ఉండడు. ఎంతో సరదాగా, ఆటపట్టిస్తూ ఉంటాడు’ అని పేర్కొన్నారు.

‘అల వైకుంఠపురములో..’ సినిమాలో కాళ్లను హైలైట్‌ చేసి చూపించడం గురించి ప్రశ్నించగా పూజా సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్‌ పాత్రకు కథానాయిక కాళ్లంటే ఇష్టమని, అతను కాళ్లను ఉద్దేశిస్తూ మాట్లాడినందుకే కష్టమైన పనులు చెప్పి శిక్షించే సీన్‌ పెట్టారని అన్నారు. అతడి తప్పులు ఎత్తి చూపిస్తూ.. నీతులు కూడా చెప్పానని, కానీ దాన్ని ఎవరూ గుర్తించలేదని పేర్కొన్నారు. అనంతరం దక్షిణాది ప్రేక్షకుల ఆసక్తి నాభి, నడము భాగంపైనే ఉంటుందని ఆమె చెప్పారు. సన్నివేశంలో భాగంగా కాళ్లను చూపించడాన్ని అసభ్యంగా భావించలేదని పేర్కొన్నారు. తన కాళ్లు ఆకర్షణీయంగానే ఉన్నాయని, కానీ వాటినే హైలైట్‌ చేయలేదని అన్నారు. దక్షిణాది ప్రేక్షకుల గురించి ఆమె అలా మాట్లాడిన తీరుపై కొందరు సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిభను చూసి ఆదరిస్తే.. ఇలా కామెంట్‌ చేయడం సరికాదని ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని